పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం

తాజా వార్తలు

Published : 06/11/2020 19:22 IST

పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం

పుల్వామా: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవానులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది లొంగిపోయాడు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్‌పొరా గ్రామంలో ముష్కరుల అలికిడి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూబింగ్‌ నిర్వహించి ఇద్దరిని ఎన్‌కౌంటర్‌ చేశాయి. ఈ ఘటనలో మరో ఉగ్రవాది లొంగిపోయినట్లు కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. వారి వద్దనుంచి తుపాకులు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ‘పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో స్థానిక ఉగ్రవాది లొంగిపోయాడు. ఆపరేషన్‌ కొనసాగుతోంది’ అని కశ్మీర్‌ పోలీసులు పేర్కొన్నారు.

పాంపొరే ప్రాంతంలో గురువారం సైతం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కట్టడిముట్టడికి వెళ్లిన సెక్యూరిటీ బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గాయపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది ఓ ఉగ్రవాదిని హతమార్చారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని