ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం

తాజా వార్తలు

Updated : 26/05/2021 22:14 IST

ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం

హత్యాచారం చేసిన పొరుగింటి వ్యక్తి

చండీగఢ్‌: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడి అఘాయిత్యానికి ఓ అమాయకపు బాలిక(7) బలయింది. ఇంటికి రాగానే తన ముద్దు ముద్దు మాటలతో రోజంతా తాము పడిన కష్టాన్ని మరచిపోయేలా చేసే బిడ్డ కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కామాంధుడి కర్కశత్వానికి బలైపోయిందని తెలిసి గుండెలవిసేలా ఏడ్చిన ఆ అమ్మానాన్నల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. హృదయవిదారకమైన ఈ ఘటన హరియాణాలోని పల్వాల్‌ జిల్లాలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పొట్ట చేత పట్టుకొని మధ్యప్రదేశ్‌ నుంచి హరియాణాకు వచ్చిన ఇద్దరు దంపతులు కూలి పనులు చేసుకొని ఇంటికి వచ్చారు.  రోజూ రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే తమ కుమార్తె కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చిన్నారి హత్యకు గురైందని తెలుసుకున్నారు. సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న ఓ గుంతలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆ ప్రాంతంలో కేవలం ఆనంద్‌ అనే వ్యక్తి ఆ రోజు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నట్టు తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తాను ఆ చిన్నారిని దగ్గరలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు చెప్పాడు. అక్కడే ఆ బాలికపై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి చంపినట్లు వివరించాడు. వెంటనే పోక్సో సహా పలు సెక్షన్ల కింద అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని