అఫ్గానిస్థాన్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం!

తాజా వార్తలు

Published : 30/11/2020 17:46 IST

అఫ్గానిస్థాన్‌లో ఏడుగురు ఉగ్రవాదుల హతం!

ఘజనీ: అఫ్గానిస్థాన్‌లోని ఘజనీ నగరంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడికి ఆ దేశ భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఆ ఆత్మాహుతి దాడికి కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న హంజా వజిరిస్థానీ సహా ఏడుగురు ఉగ్రవాదుల్ని అఫ్గాన్‌ దళాలు సోమవారం మట్టుబెట్టాయి. ఈ మేరకు అఫ్గాన్‌ రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటరీ ప్రతినిధి ఫవద్‌ అమన్‌ మాట్లాడుతూ.. ‘వైమానిక దళ ఆపరేషన్‌లో అఫ్గాన్‌ భద్రతా దళాలు ఏడుగురు ఉగ్రవాదులను హతం చేశాయి. వారిలో ఆదివారం ఘజనీ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న హంజా వజిరిస్థాని కూడా ఉన్నాడు’ అని ఆయన వెల్లడించారు.

అఫ్గానిస్థాన్‌లోని ఘజనీ నగరంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. కారులో భారీ పేలుడు పదార్థాలతో వచ్చిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దాడిలో 31 మంది భద్రతా సిబ్బంది మరణించారు. కాగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా అఫ్గాన్‌ నుంచి విదేశీ బలగాలను వెనక్కి తీసుకునే విషయమై అమెరికాతో ఒప్పందం జరిగినప్పటి నుంచి భద్రతా దళాలే లక్ష్యంగా తాలిబన్లు దాడులకు తెగబడుతుండటం గమనార్హం.

ఇదీ చదవండి

అఫ్గాన్‌లో బాంబు దాడి.. 31 మంది మృతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని