రష్యన్‌ మహిళపై ఆర్మీ అధికారి అత్యాచారం

తాజా వార్తలు

Updated : 15/12/2020 05:12 IST

రష్యన్‌ మహిళపై ఆర్మీ అధికారి అత్యాచారం

కాన్పుర్‌: మిత్రుడి మద్యంలో మత్తుమందు కలిపి, రష్యా దేశస్థురాలైన అతడి భార్యపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ ఆర్మీ అధికారి. పదోన్నతి పొందిన నేపథ్యంలో పార్టీకి ఆహ్వానించిన అధికారి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని కంటోన్మెంట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. లెఫ్టినెంట్ కల్నల్ నుంచి కల్నల్ ర్యాంకుకు పదోన్నతి పొందిన సందర్భంగా ఓ ఆర్మీ అధికారి విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు తన స్నేహితుడితోపాటు రష్యా దేశస్థురాలైన అతడి భార్యను కూడా ఆహ్వానించాడు. అయితే మిత్రుడి మద్యంలో మత్తుమందు కలిపి ఇచ్చిన కల్నల్‌ అతడు స్పృహ తప్పిపోగానే అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు, ఆమె భర్త ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కల్నల్‌ను అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి...

భర్త కళ్లముందే సామూహిక అత్యాచారం!

అత్యాచారం చేస్తే నపుంసకం లేదా ఉరిశిక్షే!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని