కారు కింద పడి 18నెలల చిన్నారి మృతి

తాజా వార్తలు

Published : 28/09/2020 01:23 IST

కారు కింద పడి 18నెలల చిన్నారి మృతి

నిజామాబాద్‌ కంఠేశ్వర్‌లో విషాదం

నిజామాబాద్‌: నగరంలోని కంఠేశ్వర్‌లో విషాదం చోటుచేసుకుంది. శివమ్‌ అపార్ట్‌మెంట్లో కారు కింద పడి 18 నెలల చిన్నారి మృతిచెందింది. ఓ వ్యక్తి కారు తీసే సమయంలో పాప ఆడుకుంటూ ముందుకు వచ్చి నిలబడింది. ఆ సమయంలో గమనించని సదరు వ్యక్తి కారును ముందుకు నడపగా.. పాప టైర్ల కింద పడి మరణించింది. 

మృతిచెందిన చిన్నారి అదే అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వాచ్‌మెన్‌ కుమార్తెగా గుర్తించారు. తమ కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై నిజామాబాద్‌ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని