పోలీసులపై నాటుబాంబులు

తాజా వార్తలు

Published : 19/08/2020 01:36 IST

పోలీసులపై నాటుబాంబులు

చెన్నై: అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు నాటుబాంబులు విసిరిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తూత్తుకుడి జిల్లా మణక్కరై ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా ఒకరు గాయపడ్డారు. రెండేళ్ల క్రితం జరిగిన జంట హత్యల నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందం మణక్కరై ప్రాంతానికి వెళ్లింది. ఈ క్రమంలో రౌడీ షీటర్లు పోలీసులపై నాటుబాంబులు విసిరారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ సుబ్రమణ్యం, బాంబు విసిరిన రౌడీ షీటర్‌ దురై ముత్తు మృతిచెందగా, మరో కానిస్టేబుల్‌ గాయపడ్డారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు పరారయ్యారు. నిందితుల వాహనంతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ జయకుమార్‌ పరిశీలించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని