Tirumala darshan tickets: తిరుమల శ్రీవారి టికెట్లతో వ్యాపారం

తాజా వార్తలు

Updated : 26/07/2021 06:56 IST

Tirumala darshan tickets: తిరుమల శ్రీవారి టికెట్లతో వ్యాపారం

ప్రైవేటు ట్రావెల్స్‌పై కేసు నమోదు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం, కల్యాణోత్సవం, ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి వ్యాపారం చేసిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌పై కేసు నమోదైంది. తితిదే నిఘా అధికారుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం చెన్నైకు చెందిన రేవతి ట్రావెల్స్‌ అధిక ధరలకు శ్రీవారి టికెట్లను భక్తులకు అమ్మినట్లు తితిదేకు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై తితిదే విజిలెన్స్‌ అధికారుల ఫిర్యాదుమేరకు తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్‌లో ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని..  www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారానే శ్రీవారి టికెట్లు బుక్‌ చేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని