హాథ్రస్‌ కేసు: గడువు కోరిన సీబీఐ

తాజా వార్తలు

Published : 17/12/2020 01:20 IST

హాథ్రస్‌ కేసు: గడువు కోరిన సీబీఐ

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార కేసు విచారణను అలహాబాద్‌ హైకోర్టు జనవరి 27కు వాయిదా వేసింది. జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, రాజన్‌  నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆ కేసుపై విచారణ చేపట్టింది. సీబీఐ దర్యాప్తు ఇంకా పూర్తి కానందున కేసు విచారణను జనవరి 27కు వాయిదా వేస్తున్నామని తెలిపింది. కాగా దర్యాప్తు పూర్తి చేసేందుకు మరికొంత సమయం కావాలని ధర్మాసనాన్ని సీబీఐ కోరింది. డిసెంబర్‌ 18లోపు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పిస్తామని పేర్కొంది. 

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో సెప్టెంబర్‌ 14న ఓ యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. వారు ఆమెపై దాడి చేయడంతో.. తీవ్ర గాయాలతో పోరాడుతూ కొద్ది రోజుల తర్వాత ఆమె మరణించింది. పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యుల ప్రమేయం లేకుండా అర్ధరాత్రి దహనం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో యూపీ ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.

ఇదీ చదవండి

లొంగిపోతారా లేక.. మానెక్‌ షా వార్నింగ్‌!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని