హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

తాజా వార్తలు

Updated : 20/12/2020 05:45 IST

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని సికింద్రాబాద్‌ ప్రాంతంలో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన పక్కా సమాచారంతో సికింద్రాబాద్‌లోని ఓ పార్శిల్‌ కార్యాలయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు జరిపారు. ఆహార పదార్థాలతో కలిపి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి పంపించేందుకు సిద్ధంగా ఉంచిన 8 కిలోల పార్శిల్‌ను అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి తెరిచి చూడగా అందులో 7 కిలోల ఆహార పదార్థాలు ఉండగా.. మరో కిలో మెథాంఫేటమైన్‌ అనే మత్తు పదార్థం ఉన్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. పార్శిల్ చేసిన వారి వివరాలను పరిశీలించగా అవన్నీ నకిలీగా తేలినట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్‌ వెల్లడించారు. కొరియర్‌ కార్యాలయం నుంచి పార్శిల్‌ను స్వాధీనం చేసుకొన్న అధికారులు నిందితుల కోసం కార్యాలయం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని