ఆమె రోదనలు వినిపించలేదేమో..!

తాజా వార్తలు

Published : 18/10/2020 12:45 IST

ఆమె రోదనలు వినిపించలేదేమో..!

బధిర బాలికపై అత్యాచారం, హత్య

 

అహ్మదాబాద్‌: తెలిసిన వ్యక్తే కదా అని అమాయకంగా వెంటవెళ్లిన ఓ దివ్యాంగురాలిపై సమీప బంధువు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. గుజరాత్‌లోని బనాస్కాంతలో పొలాల్లో నిర్జీవంగా పడిఉన్న ఓ 12 ఏళ్ల బధిర (మూగ, చెవుడు) బాలిక మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై అత్యాచారం చేసి, గొంతునులిమి హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బాలిక పసుపురంగు టీషర్ట్‌ ధరించిన ఓ వ్యక్తితో ద్విచక్రవాహనంపై వెళుతూ కనిపించింది. అయితే, అతడు తమ సమీప బంధువేనని బాలిక తల్లిదండ్రులు గుర్తించారు. 24 ఏళ్ల సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మాయమాటలు చెప్పి అతడే తమ కుమార్తెపై ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని