పుణెలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

తాజా వార్తలు

Updated : 07/06/2021 19:55 IST

పుణెలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శానిటైజర్లు తయారుచేసే ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు మృతిచెందారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది ఉన్నట్లు సమాచారం. మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని