గోదాంలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

తాజా వార్తలు

Published : 05/11/2020 01:23 IST

గోదాంలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వస్త్ర గోదాంలో మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించినట్టు  అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్ల తీవ్రతకు భవనం పైకప్పు కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అహ్మదాబాద్‌లోని పారిశ్రామికవాడ పిరానా- పిప్లాజ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 26 అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకొని మంటలు అదుపుచేస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఎల్జీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని