అలాగైతే ఇన్సూరెన్స్‌ డబ్బుల నొక్కేయొచ్చని..

తాజా వార్తలు

Published : 11/10/2020 00:59 IST

అలాగైతే ఇన్సూరెన్స్‌ డబ్బుల నొక్కేయొచ్చని..

హరియాణా: తనపై ఉన్న బీమా డబ్బుల కోసం హత్యకు గురైనట్లు నమ్మించిన వ్యక్తి పోలీసులకు పట్టుబడిన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. హరియాణాకు చెందిన వ్యాపారి రామ్‌ మెహర్‌పై రూ.కోటి, రూ.50 లక్షల పాలసీలు ఉన్నాయి. తను చనిపోయినట్లు నమ్మిస్తే ఆ డబ్బులు వస్తాయనే ఆలోచనతో తన కుటుంబ సభ్యులతో కలిసి నాటకం ఆడాడు.

గురువారం రాత్రి కారులో వెళ్తున్న తనను దారి దోపిడి ముఠా వెంబడిస్తున్నట్లు రామ్‌మెహర్‌ తమకు ఫోన్‌ చేసి చెప్పినట్లు అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారి వద్ద ఆ సమయంలో రూ.11 లక్షలు ఉన్నట్లు వారు పోలీసులకు చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు రామ్‌మెహర్‌ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ వ్యాపారి వెళ్లిన మార్గంలో వెళ్లిన పోలీసులకు ఓ ప్రదేశంలో రామ్‌మెహర్‌ కారు దగ్ధమై ఉండటం కనిపించింది. అందులో కాలిపోయిన శవాన్ని కూడా పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసం వ్యాపారిని వెంబడించిన దుండగులు సొమ్ము తీసుకొని అతడితో సహా కారును దహనం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 

తదుపరి విచారణ చేస్తుండగా ఆ వ్యాపారి బతికే ఉన్నట్లు పోలీసులకు తెలిసిందే. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం నాటకం ఆడి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో వ్యాపారి దాక్కున్నట్లు వారు గుర్తించి అరెస్టు చేశారు. కారులో ఉన్న మృతదేహం గురించి వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. తను చనిపోయినట్లు నమ్మిస్తే కుటుంబ సభ్యులకు డబ్బులు వస్తాయనే ఆశతోనే వ్యాపారి ఈ చర్యకు పాల్పడినట్లు వాళ్లు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని