ఆహారం ముట్టుకున్నాడని దారుణ హత్య

తాజా వార్తలు

Updated : 09/12/2020 15:37 IST

ఆహారం ముట్టుకున్నాడని దారుణ హత్య

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కులసర్పం బుసలు కొడుతోంది.  అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ దళితుడిపై కర్కశత్వాన్ని ప్రదర్శించారు. వేడుకలో ఆహారాన్ని ముట్టుకున్నాడని యువకుడిని కొట్టి చంపారు. ఈ కిరాతక ఘటన ఛతర్‌పుర్‌లో చోటుచేసుకుంది. ఉన్నత వర్గానికి చెందిన భూర సోని, సంతోశ్‌ పాల్‌ అనే వ్యక్తులు కిషన్‌పుర్‌ గ్రామంలో విందు నిర్వహించారు. విందు అనంతరం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు దేవరాజ్ అనురాగి (25) అనే దళిత యువకుడిని పిలిపించారు. అయితే శుభ్రం చేసేముందు భోజనం చేద్దామని అనురాగి ఆహారం వడ్డించుకోగా మా ఆహారాన్నే ముడతావా అంటూ భూర సోని, సంతోశ్‌ పాల్‌లు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిపై కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అనురాగి అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు ఛతర్‌పుర్‌ ఎస్పీ సచిన్‌ శర్మ పేర్కొన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.

ఇవీ చదవండి...

మూడు రోజులుగా వేలాడిన మృతదేహం

రేణిగుంటలో రైలు పట్టాలపై బాంబు పేలుడు
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని