కోరంగి అడవుల్లో భారీగా నాటుసారా ధ్వంసం

తాజా వార్తలు

Published : 04/09/2020 01:27 IST

కోరంగి అడవుల్లో భారీగా నాటుసారా ధ్వంసం

తాళ్లరేవు: తూర్పుగోదావరి జిల్లా కోరంగి మడ అడవుల్లో నాటుసారా తయారీ గుట్టురట్టయింది. జనసంచారానికి దూరంగా మడ అడవుల్లో నాటుసారా తయారు చేస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు భారీగా బట్టీలను ధ్వంసం చేశారు. 1400 లీటర్ల నాటుసారా, 22 నాటుసారా బట్టీలు, 230 డ్రమ్ముల్లో ఉన్న 46వేల లీటర్ల  బెల్లంఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆదేశాలతో ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సుమిత్‌ ఆధ్వర్యంలో అభయారణ్యంలో దాడులు నిర్వహించారు.

అనంతరం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో అదనపు ఎస్పీ సుమిత్‌ మీడియాతో మాట్లాడారు. ఇంతపెద్ద మొత్తంలో ఉన్న నాటుసారా బట్టీపై దాడులు చేయడం రాష్ట్రంలోనే ఇది తొలిసారి అని చెప్పారు. నాటుసారా తయారీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దన్నారు. మడ అడవులను నరికి నాటుసారా కేంద్రాలుగా మార్చే వారిపై క్రిమినల్‌ కేసులు తప్పవని సుమిత్‌ హెచ్చరించారు. ఈ దాడుల్లో కోరంగి ఎస్సై వై.సతీశ్‌, ఎక్సైజ్‌ ఎస్సై స్వామి తమ సిబ్బందితో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని