న్యూజెర్సీలో తెలంగాణవాసి మృతి.. 

తాజా వార్తలు

Published : 25/12/2020 01:42 IST

న్యూజెర్సీలో తెలంగాణవాసి మృతి.. 

హైదరాబాద్‌: అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణకు చెందిన 38 ఏళ్ల ఫార్మా ఉద్యోగి రైలు ప్రమాదంలో మరణించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన ప్రవీణ్‌ దెసిని, అతడి భార్య నవత, మూడు సంవత్సరాల కొడుకు ఐదేళ్లుగా న్యూ జెర్సీలో నివసిస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఆయన న్యూయార్క్‌కు రైల్లో ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం న్యూజెర్సీ ఎడిసన్‌ రైల్వే ట్రాక్‌పైన ప్రవీణ్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రీజినల్‌ మెడికల్ పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రవీణ్‌ ఉల్లాసంగా ఉంటాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని