బాణసంచా గోడౌన్‌లో పేలుళ్లు.. ముగ్గురి మృతి

తాజా వార్తలు

Published : 04/11/2020 17:18 IST

బాణసంచా గోడౌన్‌లో పేలుళ్లు.. ముగ్గురి మృతి

లఖ్‌నవూ : అక్రమంగా బాణసంచా తయారీ చేస్తున్న ఓ గోడౌన్‌లో పేలుళ్లు జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆ రాష్ర్టంలోని ఖుషీనగర్‌లో పలువురు వ్యక్తులు ప్రభుత్వం అనుమతి లేకుండా ఓ గోడౌన్‌లో బాణసంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఒక్కసారిగా గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని