వింత కేసులో వ్యక్తికి ఉరిశిక్ష 

తాజా వార్తలు

Published : 02/10/2020 00:48 IST

వింత కేసులో వ్యక్తికి ఉరిశిక్ష 

జపాన్‌లో 9 మందిని హత్య..

టోక్యో: కష్టాలతో చావాలనుకునే వారిని హత్య చేసి వారికి సాయం చేసినట్లు భావించే వ్యక్తికి జపాన్‌ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. జపాన్‌కు చెందిన తకహిరొ షిరైషి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన 9 మందిని వరుసగా హత్య చేశాడు. ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య ఎలా చేసుకోవాలో అంతర్జాలంలో వెతికే వారితో ఇతను ఓ సామాజిక మాధ్యమంలో పరిచయం చేసుకొని మాట్లాడేవాడు. వారి ఇబ్బందులను తెలుసుకొని చనిపోవడానికి వారిని మరింత ప్రేరేపించి ఈ వ్యక్తి హత్య చేసేవాడు.

15 నుంచి 26 సంవత్సరాలలోపు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని ఇతను చంపే సాయం(హత్యలు) చేసేవాడు. హత్య చేసిన తొమ్మిది మందిలో 7గురు మహిళలే. ఒకరు 15 సంవత్సరాల వయసున్న అమ్మాయి.. మరొకరు 20 సంవత్సరాల యువకుడు. హత్య చేసిన తర్వాత మృతదేహాలను ముక్కలుగా చేసి తన ఇంట్లోనే శీతల డబ్బాల్లో భద్రపరిచేవాడు. 2017లో ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చాలా సార్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వాటిని చూసిన షిరైషి ఆమెతో మాట్లాడి హత్య చేశాడు. ఈ మహిళ అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిన పోలీసులు నిందితుడి కోసం వేట సాగించగా ఈ హత్యలు వెలుగు చూశాయి. టోక్యోకు సమీపంగా ఉండే జామా నగరంలో తకహిరో నివాసం ఉండే ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు మృతదేహాలను ముక్కలుగా చేసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ వరుస హత్యల కేసు అప్పట్లో జపాన్‌ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై తుది తీర్పు వెలువడే నేపథ్యంలో హంతకుడు తనపై ఉన్న ఆరోపణలు నిజమేనని ఒప్పుకొన్నాడు. దీంతో న్యాయమూర్తి అతనికి ఉరిశిక్ష వేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని