J&K ఎన్‌కౌంటర్‌: ఇద్దరు ఉగ్రవాదులు హతం!
close

తాజా వార్తలు

Published : 18/08/2020 02:03 IST

J&K ఎన్‌కౌంటర్‌: ఇద్దరు ఉగ్రవాదులు హతం!

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని క్రీరీ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తోన్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు ఈ ఉదయం కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీస్‌ అధికారి, ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. దాడిచేసి తప్పించుకు పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు వేట కొనసాగించారు.

ఘటన అనంతరం అక్కడకు చేరుకున్న అదనపు బలగాలు ఆ ప్రాంతాన్నంతా జల్లెడపట్టాయి. చివరకు ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది, వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు పోలీసులపైకి మళ్లీ కాల్పులు జరిపారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తొలుత ఒక ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆపరేషన్‌ను కొనసాగించిన పోలీసులు, మూడు గంటల తర్వాత మరో ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు ప్రకటించారు. తప్పించుకు పారిపోయిన మరో ఉగ్రవాది కోసం ఆపరేషన్‌ కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని