కోడ్‌ ఉల్లంఘన: మంత్రికి మూడు నెలలు జైలు!

తాజా వార్తలు

Published : 12/11/2020 01:28 IST

కోడ్‌ ఉల్లంఘన: మంత్రికి మూడు నెలలు జైలు!

డెహ్రాడూన్‌: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఓ మంత్రికి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.1000లు జరిమానా కూడా వేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరక్‌ సింగ్‌ రావత్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కేసు నమోదైంది. దీనిపై తుది విచారణ జరిపిన రుద్రప్రయాగ్‌లోని న్యాయస్థానం ఐపీసీ 143 సెక్షన్‌ ప్రకారం ఆయన్ను దోషిగా తేల్చింది. అనంతరం శిక్ష విధించింది. అయితే, కోర్టుకు హాజరైన ఆయనకు బెయిల్‌ మంజూరైంది.

2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రావత్‌.. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు నేరపూరిత చర్యలకు పాల్పడటంతో అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. అయితే, తదనంతర కాలంలో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన భాజపాలో చేరి ప్రస్తుతం సీఎం జైరాం ఠాకూర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని