కట్నం కోసం.. అత్తింటి కిరాతకం!

తాజా వార్తలు

Published : 14/10/2020 01:04 IST

కట్నం కోసం.. అత్తింటి కిరాతకం!

లఖ్‌నవూ: కట్నం కోసం ఓ వివాహిత కళ్లు పీకేసి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని బందా జిల్లాల్లో చోటు చేసుకుంది. ఈ రాష్ట్రంలోని బదౌషా ప్రాంతంలో ఓ ఇంటికి సమీపంలో నగ్నంగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం మెడ, నడుముపై గాయాలు ఉండటంతో పోలీసులు హత్యకు గురైనట్లు ప్రాథమిక అంచనా వేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ అదే ప్రాంతానికి చెందిన సునీతగా తేలింది. తమ కూతురిని అత్తింటి వారే వరకట్నం కోసం చంపినట్లు మహిళ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో పోలీసులు మహిళ అత్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహిళ భర్త పరారీలో ఉన్నట్లు గుర్తించారు. తన కొడుకు ఉద్యోగ అన్వేషణలో భాగంగా వేరే ఊరికి వెళ్లినట్లు మృతిచెందిన మహిళ అత్త పోలీసులకు వివరించారు. మృతిచెందిన మహిళ 2015లో ఆడపిల్లకు జన్మనిచ్చినప్పటి నుంచి భర్త ఆమెతో గొడవ పడుతున్నారని ఇంటి చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి అదనపు ఎస్పీ మహేంద్ర ప్రతాప్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని