కుమారుడిని తప్పించేందుకు పోలీసుల కళ్లల్లో కారం

తాజా వార్తలు

Updated : 09/11/2020 11:33 IST

కుమారుడిని తప్పించేందుకు పోలీసుల కళ్లల్లో కారం

ముంబయి: నిందితుడైన కుమారుడిని అరెస్టు నుంచి తప్పించేందుకు ఓ తల్లి పోలీసుల కళ్లల్లో కారం చల్లింది. కుమారుడు పారిపోయేందుకు సహకరించింది. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబుజ్వాడి ప్రాంతంలో నివాసముంటున్న ఓ వ్యక్తి పలు కేసుల్లో నిందితుడు. అరెస్టు చేసేందుకు ఇద్దరు పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నారు. తన కుమారుడిని అరెస్టు చేసేందుకు వచ్చారని తెలుసుకున్న నిందితుడి తల్లి ఆ ఇద్దరి కళ్లల్లో కారంపొడి చల్లింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన అనంతరం సదరు తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మాల్వానీ ప్రాంతంలో ఉన్న నిందితుడిని కూడా అరెస్టు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని