ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు అత్యాచారం!

తాజా వార్తలు

Updated : 18/01/2021 05:20 IST

ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు అత్యాచారం!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో వరుస అత్యాచార ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల సింధి జిల్లాలో ఓ 45 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం మరువక ముందే.. ఉమేరియా జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది మంది వ్యక్తులు 13ఏళ్ల బాలికపై ఐదురోజుల వ్యవధిలో రెండు సార్లు సామూహికంగా అత్యాచారానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఏళ్ల బాలిక తనకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా జనవరి 4వ తేదీన తొలిసారి అపహరణకు గురైంది. అపహరించిన యువకుడితో పాటు మరో ఆరుగురు వ్యక్తులు బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం జరిగిన విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించిన నిందితులు.. సదరు బాధితురాలిని విడిచిపెట్టారు. అదే నిందితుల్లో ముగ్గురు జనవరి 11న ఆమెను మరోసారి అపహరించారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి మరో ఇద్దరు లారీ డ్రైవర్లతో కలిసి ఐదుగురు మళ్లీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ఐదురోజుల వ్యవధిలో తొమ్మిది మంది నిందితులు రెండు సార్లు బాలికపై పాశవిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎట్టకేలకు శుక్రవారం ఆమె ఆ మృగాళ్ల నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకుంది. 

ఈ ఉదంతంపై శుక్రవారం కత్ని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలు గాలింపు చర్యలను ప్రారంభించాయని పోలీసు ప్రతినిధి అరవింద్‌ తివారీ వెల్లడించారు. ‘ఇప్పటివరకూ ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశాం. మిగిలిన వారిని కూడా పట్టుకుంటాం. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశాం’ అని తివారీ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని సింధి జిల్లాలో ఇటీవల ఓ 45 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఇదీ చదవండి

ప్రేయసిని చంపి.. గోడలో దాచి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని