₹2కోట్లు ఇవ్వాలంటూ భాజపా నేతకు బెదిరింపు కాల్‌

తాజా వార్తలు

Published : 01/07/2021 01:23 IST

₹2కోట్లు ఇవ్వాలంటూ భాజపా నేతకు బెదిరింపు కాల్‌

పట్నా: బిహార్‌కు చెందిన ఓ భాజపా నేతకు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ధామ్‌దహా ప్రాంతం భాజపా ఇన్‌ఛార్జ్‌ గౌతమ్‌ కుమార్‌కు పింటూరాణా అనే వ్యక్తి నక్సలైట్‌నంటూ ఫోన్‌ చేశాడు. రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు. ఎనిమిది రోజుల్లో అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో గౌతమ్‌ కుమార్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు బెదిరింపు కాల్‌ చేసిందెవరో కనిపెట్టే పనిలో పడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని