AP News: పులివెందుల మండ‌లంలో కాల్పుల క‌ల‌క‌లం

తాజా వార్తలు

Updated : 15/06/2021 16:18 IST

AP News: పులివెందుల మండ‌లంలో కాల్పుల క‌ల‌క‌లం

పులివెందుల‌: క‌డప జిల్లా పులివెందుల మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లెలో కాల్పులు స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించాయి. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో పార్థ‌సార‌థిరెడ్డి(48)ని శివ‌ ప్ర‌సాద్‌రెడ్డి(62) తూపాకీతో కాల్చి చంపాడు. అనంత‌రం ప్ర‌సాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కుటుంబ స‌భ్యులు అత‌డిని వెంట‌నే పులివెందుల‌లోని ప్ర‌భుత్వ ప్రాంతీయ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ప్ర‌సాద్‌రెడ్డి మృతిచెందారు.

బంధువుల మ‌ధ్య ఆస్తి త‌గాదాలే కాల్పుల‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు చెబుతున్నారు. వైకాపాకు చెందిన రెండు కుటుంబాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగి కాల్పులకు దారి తీసిన‌ట్లు తెలిపారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల నేప‌థ్యంలో పోలీసులు న‌ల్ల‌పురెడ్డిప‌ల్లెలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 
 


 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని