TS News: ఎగ్జిబిషన్‌ సొసైటీలో ఏసీబీ తనిఖీలు

తాజా వార్తలు

Updated : 02/07/2021 22:16 IST

TS News: ఎగ్జిబిషన్‌ సొసైటీలో ఏసీబీ తనిఖీలు

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు తనిఖీలు నిర్వహించారు. సొసైటీ కార్యాలయంలో అధికారులు రికార్డులు పరిశీలించారు. దుకాణాల కేటాయింపులు, నిధుల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అనిశా అధికారులు తనిఖీలు చేశారు. సొసైటీ లావాదేవీల వ్యవహారాలపై ఆరా తీశారు. ఆరేళ్లుగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్‌ ఇటీవలే రాజీనామా చేశారు. ఈటల రాజీనామా అనంతరం సొసైటీలో అనిశా తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎలాంటి అవకతవకలు జరగలేదు: సొసైటీ కార్యదర్శి
ఎగ్జిబిషన్‌ సొసైటీలో అనిశా అధికారులు సోదాలు చేయడంపై సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్‌ స్పందించారు. సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. సొసైటీ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని.. ప్రతి సంవత్సరం ఆడిట్‌ చేస్తున్నట్లు చెప్పారు. సొసైటీ రికార్డులను అనిశా అధికారులకు చూపిస్తున్నామన్నారు. సొసైటీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. 
ఈటల రాజేందర్‌కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. సొసైటీలో 250 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. సొసైటీలో అనిశా సోదాలు జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.

ఫిర్యాదు అందింది: ఏసీబీ డీఎస్పీ
నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదు అందిందని ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్‌ తెలిపారు. ‘‘ సొసైటీ కార్యాయంలో విచారణ చేస్తున్నాం. సొసైటీ ఆఫీస్‌ సెక్షన్‌లో ఫైల్స్‌ను పరిశీలిస్తున్నాం. సొసైటీ కాలేజీ మేనేజ్‌మెంట్‌.. మెంబర్‌ల నియామకంతో పాటు  మరో ఏడు అంశాలకు సంబంధించి విచారణ చేస్తున్నాం. మొత్తం 3 సొసైటీలు ఉన్నాయి. గత ఆరేళ్లుగా జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నాం’’ అని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని