శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ముష్కరుల హతం

తాజా వార్తలు

Updated : 12/10/2020 13:22 IST

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ముష్కరుల హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురిని మట్టుబెట్టిన జవాన్లు తాజాగా శ్రీనగర్‌లో ఇద్దరు ముష్కరులను హతమార్చారు. రాంబాగ్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ముష్కరులు వారిపై కాల్పులు జరపగా జవాన్లు ఇద్దరిని ఎన్‌కౌంటర్‌ చేశారు. కాగా వారిలో ఒకరు విదేశీయుడిగా గుర్తించారు. మరో వ్యక్తి స్థానికుడిగా తేల్చారు. ‘శ్రీనగర్‌లోని రాంబాగ్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వేట కొనసాగిస్తున్నారు’ అంటూ కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని