వైకాపా నేతల వేధింపులు..ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

తాజా వార్తలు

Published : 20/04/2021 01:16 IST

వైకాపా నేతల వేధింపులు..ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

రాప్తాడు: వైకాపా నాయకులు లైంగికంగా వేధిస్తున్నారంటూ అనంతపురం జిల్లా చెర్లోపల్లికి చెందిన ఓ ఆశా కార్యకర్త ఆత్మహత్యకు యత్నించింది. అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఆదినారాయణ, వరదప్ప, రామచంద్ర, సురేశ్‌ తనను నిత్యం వేధిస్తున్నారని వాపోయింది. తమతో గడపాలని, లేదంటే ఉద్యోగాన్ని తీసేయిస్తామని బెదిరించేవారని పేర్కొంది. వారి వేధింపులు తట్టుకోలేకే మనస్తాపం చెంది వాస్మోల్‌ నూనె తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న రాప్తాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని