కాల్పుల మోత.. ఎమ్మెల్యే పరుగులు

తాజా వార్తలు

Published : 29/05/2021 01:37 IST

కాల్పుల మోత.. ఎమ్మెల్యే పరుగులు

జోర్హాట్: అసోంలో కాంగ్రెస్ నేత, మరియానీ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. జోర్హాట్ జిల్లాలోని అసోం-నాగాలాండ్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కొంతమంది నాగాలాండ్ వాసులు అటవీ భూమిని అక్రమిస్తున్నారన్న సమాచారం మేరకు రూప్‌జ్యోతి అక్కడికి వెళ్లారు. ఆయన వెంట కొందరు పోలీసులు, అటవీ శాఖ అధికారులు, మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. అయితే ఆక్రమణలను పరిశీలిస్తున్న సమయంలో వారికి సమీపంలో తుపాకుల మోత వినిపించింది. వెంటనే తీవ్రంగా భయపడిన రూప్‌జ్యోతి, ఆయన వెంట ఉన్నవారు అక్కడి నుంచి పరుగులు తీశారు.

అనంతరం పోలీసులు ఎమ్మెల్యేను సురక్షిత ప్రాంతానికి తరలించారు. తమను లక్ష్యంగా చేసుకొనే ఆ కాల్పులు జరిగాయని కుర్మి పేర్కొన్నారు. అయితే అదృష్టవశాత్తు తామంతా తుపాకీ గుళ్ల నుంచి తప్పించుకున్నామని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు అసోం ప్రభుత్వం.. నాగాలాండ్‌ సర్కారుతో మాట్లాడటం లేదని కుర్మి ఆరోపించారు. ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని పోలీసు శాఖను ఆదేశించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని