చనిపోయిన భర్తతో తిలకం దిద్దించి.. 

తాజా వార్తలు

Published : 31/05/2021 17:26 IST

చనిపోయిన భర్తతో తిలకం దిద్దించి.. 

కోల్‌కతా: ఓ యువజంట వివాహబంధం విషాదాంతమైంది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీయువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. దీన్ని అమ్మాయి తల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. మనస్తాపం చెందిన అబ్బాయి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ్‌బెంగాల్‌లోని బర్ధమాన్‌లో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణోత్తర పరీక్షల అనంతరం శవాన్ని అప్పగించారు. అనంతరం కోపంతో రగిలిపోయిన యువకుడి తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు యువతి ఇంటిని చుట్టుముట్టారు. చనిపోయే ముందు ఆ యువకుడు ఫొటోలు పంపినా.. కాపాడేందుకు ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కనీసం తమకు సమాచారం ఇచ్చినా కాపాడుకునే వాళ్లమని వాపోయారు. ఆగ్రహంతో ఆ అమ్మాయి, ఆమె తల్లిపై దాడి చేశారు. తర్వాత బలవంతంగా ఆ యువతిని లాక్కొచ్చి నొసటన యువకుడి వేలితో తిలకం దిద్దించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు యువతి తల్లి తమపై దాడికి పాల్పడ్డారంటూ స్థానిక మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని