వివేకా హ‌త్యకేసు: 8 మందిని విచారిస్తున్న సీబీఐ

తాజా వార్తలు

Updated : 20/06/2021 13:45 IST

వివేకా హ‌త్యకేసు: 8 మందిని విచారిస్తున్న సీబీఐ

క‌డ‌ప‌: మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణ 14వ రోజు కొన‌సాగుతోంది. క‌డ‌ప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇవాళ ఎనిమిది మంది అనుమానితుల‌ను అధికారులు విచారిస్తున్నారు. మూడు రోజులుగా వివేకా ప్ర‌ధాన అనుచ‌రుడు ఎర్ర‌గంగిరెడ్డిని ప్ర‌శ్నిస్తున్న అధికారులు.. ఇవాళ కూడా అత‌డిని విచార‌ణ‌కు పిలిచారు. ఆయ‌న‌తో పాటు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం సింహాద్రిపురానికి చెందిన అశోక్‌కుమార్‌, ఓబుల‌ప‌తి నాయుడు, రాఘ‌వేంద్ర‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. పులివెందుల‌కు చెందిన శ్రీ‌రాములు, హ‌రినాథ‌రెడ్డితో పాటు భార్య‌భ‌ర్త‌లు కృష్ణా, సావిత్రి కూడా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే వివేకా మాజీ కారు డ్రైవ‌ర్ ద‌స్త‌గిరితోపాటు, ఆయ‌న ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ ఇద‌య‌తుల్లా, ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండే కిరణ్‌కుమార్ యాద‌వ్‌, సునీల్‌కుమార్ యాద‌వ్‌ల‌తో పాటు మ‌రికొంద‌రిని సీబీఐ అధికారులు ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. వివేకా హ‌త్య జ‌ర‌గ‌డానికి 15 రోజుల ముందు నుంచి ఆయ‌న కాల్‌డేటా సేక‌రించిన అధికారులు ఆ మేర‌కు విచార‌ణ చేస్తున్న‌ట్లు స‌మాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని