బ్లాక్ ఫంగ‌స్ ఇంజక్షన్ల ‘బ్లాక్‌’ ముఠాలు అరెస్ట్‌

తాజా వార్తలు

Updated : 10/06/2021 14:53 IST

బ్లాక్ ఫంగ‌స్ ఇంజక్షన్ల ‘బ్లాక్‌’ ముఠాలు అరెస్ట్‌

హైద‌రాబాద్‌: బ్లాక్ ఫంగ‌స్ బాధితుల‌కు వినియోగించాల్సిన ఇంజ‌క్ష‌న్ల‌ను నగరంలో వేర్వేరు చోట్ల అక్ర‌మంగా విక్ర‌యిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో గాంధీ ఆస్పత్రి పొరుగు సేవ‌ల మహిళా ఉద్యోగి మ‌రో ముగ్గురితో క‌లిసి ఇంజెక్ష‌న్ల‌ను బ్లాక్‌లో విక్ర‌యిస్తుండ‌గా పేట్ బ‌షీర్‌బాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నాలుగు ఇంజెక్ష‌న్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రో దాడిలో అపోలో ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల ద‌గ్గ‌రి నుంచి రెండు ఇంజెక్ష‌న్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఇంజెక్ష‌న్‌ను రూ.35 వేల నుంచి రూ.40 వేల‌కు బ్లాక్ లో విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు.

మరోవైపు స‌రూర్‌న‌గ‌ర్‌లోనూ ఈ ఇంజ‌క్ష‌న్ల‌ను బ్లాక్‌లో విక్ర‌యిస్తున్న కూక‌ట్ ప‌ల్లికి చెందిన మ‌నీశ్ అనే యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో ఇంజ‌క్ష‌న్‌ను రూ.35 వేల‌కు అమ్ముతున్న‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం రావ‌డంతో ఎల్బీన‌గ‌ర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని