బెంగాల్‌లో భాజపా కార్యకర్తలపై బాంబు దాడి!

తాజా వార్తలు

Published : 06/03/2021 16:03 IST

బెంగాల్‌లో భాజపా కార్యకర్తలపై బాంబు దాడి!

 

కోల్‌కతా: బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బాంబు దాడి కలకలం సృష్టించింది. గోసబా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ బృందంపై నాటు బాంబు విసిరారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు. అయితే దాడిలో గాయపడిన వారంతా భాజపా కార్యకర్తలుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. భాజపాకు చెందిన కార్యకర్తలు కొందరు శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిపై నాటు బాంబు విసిరారు. పేలుడు ధాటికి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారే చేశారని క్షతగాత్రుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బెంగాల్‌లో కార్మిక మంత్రి జాకీర్‌ హుస్సేన్‌పైనా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని