Crime news: ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలోకి దూసుకెళ్లిన కారు

తాజా వార్తలు

Published : 06/10/2021 01:19 IST

Crime news: ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్‌: ప్రమాదవశాత్తు అదుపుతప్పిన కారు ఏటీఎంలోకి దూసుకెళ్లిన ఘటన మేడ్చల్‌ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌కు చెందిన కిషన్‌రావు తన ఇంటి నుంచి కారు రివర్స్‌ తీస్తుండగా అదపుతప్పి రోడ్డుకు అవతలివైపు ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏటీఎం గది అద్దాలతో పాటు ఏటీఎం యంత్రం కూడా ధ్వంసమైంది. కారు దూసుకెళ్లిన సమయంలో ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని