Accident: ముంబయిలో ఘోర ప్రమాదం

తాజా వార్తలు

Updated : 04/07/2021 06:37 IST

Accident: ముంబయిలో ఘోర ప్రమాదం

ముంబయి: అతివేగం కారణంగా ముంబయిలో జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ముంబయి బోర్ ఘాట్‌ ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా.. ఆ కారుతో పాటే ముందుకు వెళ్లి మరో లారీని ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య ఆ కారు నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు. వేగ నియంత్రణ లేకపోవడంతో మరింత ముందుకు దూసుకుపోయిన ఆ లారీ.. ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని