జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు

తాజా వార్తలు

Updated : 29/04/2021 12:16 IST

జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్‌ బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. అందువల్ల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు తాజాగా ఇవాళ జగన్‌కు నోటీసులు జారీ చేసింది. రఘురామ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని జగన్‌, సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై వచ్చే నెల 7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని