Ap News: వివేకా కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

తాజా వార్తలు

Published : 25/06/2021 17:28 IST

Ap News: వివేకా కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 19వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు చెందిన ఇద్దరు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సింహాద్రిపురం మండలానికి చెందిన వైకాపా నేత సుధాకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. అతడిని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. పులివెందులకు చెందిన మరో అనుమానితుడ్ని కూడా విచారిస్తున్నారు. వీరిని సాయంత్రం వరకు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని