వివేకా హ‌త్యకేసులో 8వరోజు సీబీఐ విచారణ

తాజా వార్తలు

Updated : 14/06/2021 11:45 IST

వివేకా హ‌త్యకేసులో 8వరోజు సీబీఐ విచారణ

క‌డ‌ప‌: మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో ఎనిమిదో రోజు సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. క‌డ‌ప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఇవాళ పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్‌, సునీల్‌ కుమార్‌ యాదవ్‌ల తండ్రి కృష్ణ‌య్య‌ను విచారిస్తున్నారు. ఈ హ‌త్య కేసులో అనుమానితులుగా ఉన్న వివేకా మాజీ కారు డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, ఆయ‌న‌ ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేటర్‌గా ప‌ని చేసిన‌ ఇద‌య‌తుల్లాతో పాటు కిర‌ణ్‌, సునీల్‌ల‌ను సీబీఐ అధికారులు ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.

సునీల్ కుమార్ యాద‌వ్‌ వివేకాకు అత్యంత స‌న్నిహితుడిగా ఉండేవాడ‌ని పులివెందుల‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల కింద‌ట సీబీఐ అధికారులు పులివెందులోని అతడి ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌శ్నించారు. దీంతో పాటు నిన్న వివేకా ఇంటిని సైతం మూడు గంట‌ల పాటు ప‌రిశీలించిన అధికారులు కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని