వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

తాజా వార్తలు

Updated : 11/06/2021 14:56 IST

వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

కడప నేరవార్తలు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కరోనా నేపథ్యంలో ఇటీవల  దర్యాప్తు కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో సీబీఐ అధికారులు గత ఐదురోజులుగా కడపలో మకాం వేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
 వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో సంచరించిన వాహనాలకు సంబంధించిన వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్‌ యాదవ్‌ వరుసగా మూడో రోజు కూడా హాజరయ్యారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సైతం ఐదో రోజు విచారించారు. దర్యాప్తులో పలు కీలక అంశాలను అధికారులు రాబట్టినట్లు సమాచారం. ఓ బృందం కడపలో అనుమానితులను విచారిస్తుండగా మరో రెండు బృందాలు పులివెందుల చేరుకున్నాయి. వివేకా ఇంటి పరిసరాలను మరోసారి పరిశీలించారు. కిరణ్‌ కుమార్‌ యాదవ్‌ ఇంటిని కూడా సీబీఐ బృందం పరిశీలించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని