AP News: వివేకా వాచ్‌మెన్‌ను ప్రశ్నించిన సీబీఐ

తాజా వార్తలు

Updated : 13/07/2021 03:40 IST

AP News: వివేకా వాచ్‌మెన్‌ను ప్రశ్నించిన సీబీఐ

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 36వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్‌ జైలు అతిథిగృహంలో అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్నను సీబీఐ ప్రశ్నించింది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటి వద్ద రంగన్న కాపలా ఉన్నారు. గతంలో సిట్‌ అధికారులు కూడా ఆయన్ను విచారించి గుజరాత్‌లో నార్కో పరీక్షలు నిర్వహించారు.

మరోవైపు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరిని కూడా సీబీఐ విచారిస్తోంది. గత రెండు వారాలుగా ఎర్ర గంగిరెడ్డిని.. గత 20 రోజులుగా దస్తగిరిని విచారిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని