AP News: స్విమ్స్‌లో కరోనా రోగి ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 14/06/2021 03:51 IST

AP News: స్విమ్స్‌లో కరోనా రోగి ఆత్మహత్య

తిరుపతి: తిరుపతిలోని స్విమ్స్‌ పద్మావతి రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్పత్రి మెడిసిన్‌ వార్డులో ఉరేసుకుని జయమ్మ అనే రోగి మృతిచెందారు. నెల్లూరు జిల్లాలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో స్విమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో జయమ్మ బలవన్మరణానికి పాల్పడ్డారు.

మరోవైపు అదే ఆస్పత్రిలో ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. సరైన వైద్యం అందకే యువకుడు మృతిచెందాడంటూ అతడి తరఫు బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకుని వారి సర్ది చెప్పారు.

మెరుగైన వైద్యం అందించాలి: ఆళ్ల నాని

కరోనా బాధితురాలు జయమ్మ మృతిపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. బాధితుల బంధువులు ఆందోళన చేయడానికి గల కారణాలపై మంత్రి ఆరా తీశారు. ఈ ఘటనపై డీఎంహెచ్‌వో, ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఆళ్ల నాని ఫోన్లో మాట్లాడారు. కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల బంధువులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని చెప్పారు. కొవిడ్ సోకిన వారికి అందించే ఆహారం, శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని