రూ.10 అడిగారు.. రూ.2.5 లక్షలు కాజేశారు

తాజా వార్తలు

Published : 14/05/2021 06:56 IST

రూ.10 అడిగారు.. రూ.2.5 లక్షలు కాజేశారు

హైదరాబాద్‌: సైబర్‌క్రైం నేరగాళ్ల నయా మోసాలు రోజురోజూకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఉద్యోగం పేరుతో కుత్బుల్లాపూర్‌కు చెందిన మహిళను సైబర్‌నేరగాళ్లు మోసగించారు. ఉద్యోగం పేరట సుమారు రూ.2.52 లక్షలను కాజేశారు. ఉద్యోగం కోసం నౌకరి.కామ్‌లో మహిళ తన వివరాలు నమోదు చేసింది. దీంతో సైబర్‌నేరగాళ్లు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.10 చెల్లించాలని అడిగారు. నిజమే అని నమ్మి సదరు మహిళ సైబర్‌ నేరగాళ్లు పంపిన లింక్‌ క్లిక్‌ చేయడంతో ఖాతా నుంచి నగదు మాయం అయింది. ఆమె ఖాతా నుంచి పలు విడతలుగా రూ.2.52 లక్షలను సైబర్‌ నేరస్థులు స్వాహా చేశారు. దీంతో బాధితురాలు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

టీకా పేరుతో మోసం
కొవిడ్‌ టీకాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు బంజారాహిల్స్‌కు చెందిన వస్త్ర వ్యాపారిని మోసం చేశారు. వస్త్ర దుకాణంలో సిబ్బందికి కరోనా టీకాలు వేస్తామని దుండగులు రూ.1.10 లక్షలను  అడిగారు. దీంతో సదరు వ్యాపారి దుండగుల ఖాతాకు నగదును పంపాడు. అనంతరం దుండగులు స్పందించకపోవడంతో బాధితులు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని