cybre crime: ఎక్కువ లాభమని చెప్పి రూ.12 లక్షలు స్వాహా

తాజా వార్తలు

Published : 28/05/2021 01:40 IST

cybre crime: ఎక్కువ లాభమని చెప్పి రూ.12 లక్షలు స్వాహా

హైదరాబాద్‌: సైబర్‌ మోసాలు రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. మహానగరంలో ఒకే రోజు రెండు సైబర్‌ మోసాలు వెలుగులోకి  వచ్చాయి. బాలానగర్‌కు చెందిన ఓ మహిళ నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.12.91 లక్షలు స్వాహా చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం ఆశ చూపి మోసానికి పాల్పడ్డారు. లైటనింగ్‌ పవర్‌ యాప్‌ ద్వారా పెట్టుబడి పెట్టాలని సదరు మహిళకు సూచించారు. తొలుత తక్కువ మొత్తానికి ఎక్కువ లాభం ఇచ్చారు. లాభాపేక్షతో బంధువుల వద్ద అప్పుజేసి మరీ ఆ మహిళ పెట్టుబడి పెట్టారు. మొత్తం రూ.12.91 లక్షలు పెట్టుబడి పెట్టాక మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న సదరు మహిళ బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల సరఫరా పేరుతో..
ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల సరఫరా పేరుతో సైబర్‌ నేరగాళ్లు మరో మోసానికి పాల్పడ్డారు. సిద్ధా ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని సిద్ధార్థను మోసగించి మొత్తం రూ.2.93 లక్షలు వసూలు చేశారు. ఫిలిప్స్‌ ఇండియా పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్న నేరగాళ్లు చేసుకున్నారు. ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు రాకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని