cyber crime: కారు కావాలా.. క్యాష్‌ కావాలా..?రూ. 16 లక్షల మోసం

తాజా వార్తలు

Updated : 17/08/2021 05:10 IST

 cyber crime: కారు కావాలా.. క్యాష్‌ కావాలా..?రూ. 16 లక్షల మోసం

హైదరాబాద్‌: సైబర్‌ నేరాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లాటరీలో విలువైన కారు గెలుపొందారని సైబర్‌ నేరగాళ్లు రూ. 17.35 మోసం చేశారు. నగరంలోని గోల్కొండకు చెందిన అబ్దుల్ ముజీబ్ ఖాన్‌కు మీరు విలువైన కారు గెలిచారంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. కారు కావాలా, క్యాష్‌ కావాలా అని అడగడంతో నగదు కావాలని బాధితుడు వారితో చెప్పాడు. దీంతో ఆ డబ్బును పంపించాలంటే వివిధ చార్జీలు కట్టాలని, విడతల వారీగా రూ.17.35 లక్షలు కాజేశారు. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరు చెప్పి మోసం
మరో కేసులో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.3.7 లక్షలు వసూలు చేశారు. దీంతో బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

నైజీరియన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
గతంలో రూ.16 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన ఓ మహిళకు విలువైన బహుమతి వచ్చిందని సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. వివిధ ఛార్జీల పేరుతో రూ.16 లక్షలను కాజేశారు.  దీంతో బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఢిల్లీలో ఉన్న మైకేల్ అనే నైజీరియన్‌ను అరెస్ట్ చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని