బాంబు దాడితో కుమారుడిని హత్య చేయాలని...

తాజా వార్తలు

Updated : 31/01/2021 05:28 IST

బాంబు దాడితో కుమారుడిని హత్య చేయాలని...

కోల్‌కతా: బాంబుతో దాడి చేసి కుమారుడిని హత్య చేయాలన్న ఆ తండ్రి వ్యూహం బెడిసికొట్టింది. ఆ నాటుబాంబు పేలి తండ్రి మృతిచెందగా.. కుమారుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకుంది. కాశీపూర్‌ రోడ్డులో నివాసముండే షేక్‌ మత్లబ్‌ (65) ప్రతిరోజు మద్యం సేవించి కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. అతడి కుమారుడు షేక్‌ నాజిర్‌ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మద్యం సేవించి వచ్చిన మత్లబ్‌ కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలోనే తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మత్లబ్‌ ఇంట్లో దాచిన నాటుబాంబు తీసుకొచ్చి కుమారుడిపై వేసేందుకు ప్రయత్నించాడు. నాజిర్‌ తండ్రిని అడ్డుకోగా బాంబు కిందపడిపోయింది. దీంతో అది పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దం విన్న ఇంటి చుట్టుపక్కల వారు వచ్చి తండ్రీకొడుకులను ఆసుపత్రికి తరలించారు. కాగా షేక్‌ మత్లబ్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాజిర్‌ చేతి వేళ్లు చిట్లిపోయాయని, అతడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని పోలీసులు తెలిపారు. మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మత్లబ్‌కు నాటుబాంబు ఎక్కడ లభ్యమైంది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి...

అడ్డుగా ఉన్నాడని.. అంతమొందించారు..!

విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై విషమిచ్చి హత్య
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని