ఇంటికి తాళం వేసి నిప్పు..

తాజా వార్తలు

Updated : 03/04/2021 13:40 IST

ఇంటికి తాళం వేసి నిప్పు..

ఆరుగురి సజీవ దహనం

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆకతాయి ఓ ఇంటికి తాళం వేసి నిప్పంటించాడు. కనూరు గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు ఘటనాస్థలిలోనే సజీవ దహనమయ్యారు. తీవ్ర గాయాలపాలైన మరో ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా మృతిచెందిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిప్పంటించిన వ్యక్తిని బోజా(50)గా గుర్తించారు. సదరు వ్యక్తికి బాధిత కుటుంబానికి వివాదాలు ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని