close

తాజా వార్తలు

Updated : 11/04/2021 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

TS: ఈడీ సోదాల్లో భారీగా నగదు, ఆస్తులు లభ్యం

హైదరాబాద్: ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ముమ్మరం చేసింది. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పదికి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ భారీగా నగదు, రూ. కోటికిపైగా విలువైన ఆభరణాలు, బ్లాంక్‌ చెక్కులు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకుంది. మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయిని మాజీ పీఎస్ ముకుందరెడ్డి, నిందితురాలు దేవికారాణి ఇళ్లలో సోదాలు జరిగాయి.

ఈ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి బంధువు వినయ్‌రెడ్డి ఇళ్లలో భారీగా నగదు, నగలు లభించాయి. ఏడు డొల్ల కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్‌రెడ్డి ఇంట్లోనూ నగలు, నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ డొల్ల కంపెనీల వెనుక కొందరు నేతల ప్రమేయం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఉందనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. కాగా మరో ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.



 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని