విశాఖ గేట్‌ వేలో ప్రమాదం.. కంటైనర్లు దగ్ధం
close

తాజా వార్తలు

Updated : 27/07/2020 18:57 IST

విశాఖ గేట్‌ వేలో ప్రమాదం.. కంటైనర్లు దగ్ధం

అక్కిరెడ్డిపాలెం, విశాఖపట్టణం: షీలానగర్‌ సమీపంలోని గేట్‌వే కంటైనర్‌ యార్డులో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్‌లను తరలించే సమయంలో క్రేన్‌కు మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం సంభవించినట్లు గేట్‌ వే సిబ్బంది పేర్కొన్నారు. కంటైనర్‌లో రసాయనాలతో కూడిన సరకు నిల్వలు ఉండడంతో దట్టమైన పొగలు వచ్చి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో రసాయనాల వాసన రావడంతో పరిసర ప్రాంత ప్రజలు భయంతో ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రెండు కంటైనర్‌లు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు కంటైనర్‌లు స్వల్పంగా దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న మర్రిపాలెం అగ్ని మాపక శకటాలు వచ్చి మంటలను అదుపులో తెచ్చాయి.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని