కారు ప్రమాదంలో ఐదుగురి మృతి

తాజా వార్తలు

Published : 05/01/2020 01:29 IST

కారు ప్రమాదంలో ఐదుగురి మృతి

మందస:  శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో కారు డ్రైవర్‌, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్రేన్‌ సాయంతో కాల్వలో పడిన కారును బయటకు తీశారు. మృతులు ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన డి.ప్రతాప్‌, రీతూ, బనిత జన్నా, ఆదర్శ్‌కుమార్‌గా గుర్తించారు. వీరంతా సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని