మంగళూరు విమానాశ్రయంలో బాంబు

తాజా వార్తలు

Published : 21/01/2020 07:08 IST

మంగళూరు విమానాశ్రయంలో బాంబు

నిర్జన ప్రదేశంలో పేల్చిన నిపుణులు

బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో సోమవారం బాంబు కనిపించడం కలకలం సృష్టించింది. టికెట్‌ కౌంటర్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి విడిచి వెళ్లిన ఓ ల్యాప్‌టాప్‌ బ్యాగులో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది దాన్ని గుర్తించారు.పేలుడు పదార్థాన్ని బాంబు నిర్వీర్యక దళం నిపుణులు విమానాశ్రయానికి 2 కిలోమీటర్ల దూరంలోని కెంజారు మైదానానికి తీసుకెళ్లి ఇసుక మూటల మధ్య ఉంచి పేల్చివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తలకు టోపీ పెట్టుకుని, నీలం రంగు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌ బ్యాగును వదిలి వెళ్లాడని.. అతడు ఆటోలో విమానాశ్రయానికి వచ్చాడని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని